![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -52 లో.....సూర్యని కలవడానికి జాను వస్తుంది. సింహాద్రి తీసుకొని వచ్చిన అమెరికా సంబంధం గురించి చెప్తుంది. నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుందని జాను చెప్పగానే మరి ఎందుకు లేట్.. నీకు తెలిసిన హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమని సూర్య సలహా ఇస్తాడు. మంచి సలహా అని జానూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఐడియా ఇవ్వడం అది నీకు నచ్చడం అంతా డేస్టినీ అని సూర్య అంటాడు.
ఆ తర్వాత జాను తనకి తెలిసిన అతనికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. అతను కనుక్కొని చెప్తానని అంటాడు. మరొకవైపు ఇక నువ్వు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్తే అక్కడ వాళ్ళకి నచ్చినట్లు ఉండమని నందుకి శారద చెప్తుంది. అక్క నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ రావా అని కిన్నెరా అడుగుతుంది. వస్తాను.. ఎందుకు రాను.. అని నందు అంటుంది. నానమ్మ ఇన్ని రోజులు తిట్టాను నన్ను క్షమించమని పెద్దావిడతో నందు అంటుంది. అప్పుడే జాను వచ్చి నాకు ఎందుకో ఈ పెళ్లి కరెక్ట్ కాదని అనిపిస్తుందని జాను అనగానే అతనిపై నందు కోప్పడుతుంది. అసలు నేనే నీకు కరెక్ట్ కాదని అంటుంది. ఎందుకే దాన్ని బాధపెడుతావని పెద్దావిడ అంటుంది. జానూని శారద పక్కకి తీసుకొని వెళ్లి నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడకని కోప్పడుతుంది.
మరుసటిరోజు నందు పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. అందరితో సెల్ఫీ తీసుకుంటుంది. అప్పుడే నందు కోసం మురళి పట్టీలు.. ఇంకా కొన్ని వస్తువులు తీసుకొని వస్తాడు. అవి నందుకి ఇస్తాడు. ఈ పట్టీలు నేను పెడతానని మురళి అనగానే నందు సరే అంటుంది. మురళి ఆ పట్టీలు పెట్టి ఎమోషనల్ అవుతాడు. ఇవన్నీ ఎప్పుడు కొన్నావ్ బావ అని కిన్నెరా అడుగుతుంది. అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకున్నానని మురళి చెప్తాడు. బావ నువ్వు కూడా పక్క ఊరిలోనో, ఈ ఊరిలోనో అమ్మాయిని చూసి చేసుకో.. మెషిన్ కుట్టే అమ్మాయి అయితే నీకు హెల్ప్ అవుతుందని నందు అనగానే మురళి డల్ అవుతాడు. తరువాయి భాగంలో సింహాద్రి తీసుకొని వచ్చిన సంబంధం అమెరికా సంబంధం కాదు.. పైగా రెండో సంబంధం.. ఆ విషయం ఎవరికి తెలియనివ్వొద్దని అబ్బాయి వాళ్ళకి సింహాద్రి చెప్తాడు. అప్పుడే జాను, సూర్య వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |